Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి 14 మంది న్యూస్ యాంకర్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీరికి ఈ కూటమి నేతలు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఈ వివాదంపై సీఎం హిమంత బిశ్వసర్మ మాట్లాడారు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ కి వచ్చిన ఆయన మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ 1975 ఎమర్జెన్సీ సమయంలోనే మీడియాపై నిషేధం విధించిందని, ఇది కొత్త కాదని, రిహార్సల్ మాత్రమే అని అన్నారు. ఏదైన కారణం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా సెన్సార్ కి గురవుతుందని కామెంట్స్ చేశారు. సరైన సమయంలో ఇస్రో చంద్రయాన్ తయారు చేసిందని, నేను కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని చంద్రుడిపైకి పంపిస్తానని, అక్కడ అధికారం ఏర్పాటు చేసుకోండి, మీడియాపై నిషేధం విధించుకోండి’’ అంటూ చరకులు అంటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చైల్డిష్ గా అభివర్ణించారు.
Read Also: India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
టీవీ యాంకర్లపై బహిష్కారంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. మేము ఎవరిని నిషేధించలేదు, బహిష్కరించలేదని, ఇది సహాయనిరాకరణ ఉద్యమం, సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎవరికీ మేము సహకరించమని, అలాంటి వారు మా శతృవులని అన్నారు. ఏదీ శాశ్వతం కాదని, రేపు వారు చేస్తున్న పని భారత దేశానికి మంచిది కానది గ్రహిస్తే, మళ్లీ వారి టీవీ షోలకు హాజరవుతామని అన్నారు.
అదితి త్యాగి, అమన్ చోప్రా, అమీష్ దేవ్‌గన్ ఆనంద్ నరసింహన్, అర్ణబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాషర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా ఇలా 14 మంది యాంకర్లను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. దీనిని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఎమర్జెన్సీతో పోల్చారు. ఇటువంటి పరిస్థితులను కేవలం ఎమర్జెన్సీ కాలంలో చూశామన్నారు. నిరాశతోనే విపక్ష కూటమి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విపక్షాల చర్యలను నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది.
#WATCH | Jabalpur, MP: On the INDIA alliance's announcement to boycott several TV news anchors, Assam CM Himanta Biswa Sarma says, "This boycott and media censorship can be traced back to 1975. It is not new. It is a rehearsal for you. For any reason, if the Congress government… pic.twitter.com/kX5ayDkrWa
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 16, 2023