Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం మంచిది కాదని తెలిపింది.
పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఓ నవ జంట జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే కన్నీళ్లను మిగిల్చింది. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే భర్త చనిపోవడంతో నవ వధువు గుండెలు పగిలేలా రోధించింది. హనీమూన్ కోసం వెళితే ప్రాణాలే పోయాయి. మృతదేహాన్ని ఇంటికి చేర్చారు అధికారులు. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు పలికింది. “జై హింద్”…