Pini Village History Where Women Dont Wear Dress For 5 Days: విదేశాల్లో మహిళలు అరకొర దుస్తులు వేసుకోవడం, ఆయా సందర్భాల్లో దుస్తులు లేకుండానే తిరుగుతుండడం లాంటివి జరుగుతుంటాయి. ఇదంతా అక్కడ సర్వసాధారణం. కానీ.. మన భారతదేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. మన దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. అఫ్‌కోర్స్.. ఇక్కడ కూడా పాశ్చాత్త సంస్కృతి వ్యాపించింది. అయినా.. మరీ విదేశీయుల తరహాలో అరకొర దుస్తులైతే ధరించరు. దుస్తులు వేసుకోకుండా బయటకు అడుగు పెట్టరు. కానీ.. ఓ గ్రామంలో మాత్రం మహిళలు ఐదు రోజులపాటు దుస్తులు వేసుకోకుండా తిరుగుతారు.
Vijayawada Crime: దారుణం.. వివాహితపై వేధింపులు, ప్రశ్నించినందుకు కత్తులతో దాడి
ఆ ఊరు పేరు పిని. ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉంది. ఈ గ్రామంలోని మహిళలు.. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా, నగ్నంగా ఉంటారు. అయితే, మరీ పూర్తి నగ్నంగా కాకుండా పలుచటి వస్త్రాల్ని వేసుకోవచ్చు. అంతేకాదు.. భార్యాభర్తలు ఒకరితో మరొకరు మాట్లాడుకోకూడదు. దూరం తప్పకుండా పాటించాలి. శతాబ్దాల నాటి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. ఒక్క మహిళలకే కాదండోయ్.. పురుషులకి కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ఆ ఐదు రోజుల పాటు పురుషులు మద్యం తాగకూడదు, మాంసం ముట్టుకోకూడదు. ఈ నియమాలు పాటించకపోతే.. దేవుళ్లకు కోపం వచ్చి, కీడు జరుగుతుందని ఆ గ్రామ వాసులు నమ్ముతారు.
Bomb Threat: గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్.. ముప్పుతిప్పలు పెట్టిన హైదరాబాదీ
అసలీ సంప్రదాయం ఎలా వచ్చిందంటే.. ఒకప్పుడు పినీ గ్రామంలో రాక్షసులు తిరిగేవట. అవి గ్రామంలోని మహిళల దుస్తులు చింపి తీసుకెళ్లేవట. ఈ రాక్షసుల నుంచి గ్రామస్తుల్ని రక్షించేందుకు ‘లహువా ఘోండ్’ అనే దేవత ప్రత్యక్ష్యమై, ఆ రాక్షసుల్ని చంపి, ప్రజలను కాపాడింది. భాద్రపద మాసం తొలి రోజు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు స్త్రీలు దుస్తులు ధరించకూడదనే సంప్రదాయం మొదలైంది. ఆ 5 రోజులపాటు గ్రామంలోకి బయటి వ్యక్తుల్ని రానివ్వరు. ఈ ప్రత్యేక పండుగలో వేరే గ్రామాలకు చెందిన జనాలు కూడా పాల్గొనకూడదు.