Heartbreaking story: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్‌కి వెళ్లి మరణించారు. అయితే, వారితో కూడా వెళ్లిన పెంపుడు కుక్క తన యజమానులు మృతదేహాలకు రెండు రోజుల పాటు కాపలా కాసింది. ఈ ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తోంది. విహారయాత్రకు వెళ్లిన యువతీ, యువకులు అనూహ్య రీతిలో మరణించారు. వారి డెడ్‌బాడీలను 48 గంటల తర్వాత కనుగొన్నారు. ట్రెక్కర్స్‌తో పాటు వచ్చిన జర్మన్ షెఫర్డ్, వారి శరీరాలను కాపాడటమే కాకుండా, ఫిబ్రవరి 6న వారిని రెస్క్యూ బృందం గుర్తించే వరకు అరుస్తూనే ఉంది.
మరణించిన ట్రెక్కర్లను పఠాన్‌కోట్‌లోని శివనగర్‌కి చెందిన అభినందన్ గుప్తా (30), మహారాష్ట్రకు చెందిన ప్రణితా వాలా (26)గా గుర్తించారు. పారాగ్లైడింగ్‌కి ప్రసిద్ధి చెందిన లోయ ప్రాంతంలో కనిపించకుండా పోయారు. వీరు టేకాఫ్ పాయింట్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దిగువన శవాలుగా కనుగొనబడ్డారు. మంచులో పడిపోవడం వల్లే ఇద్దరు మరణించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Read Also: CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
అభినందన్ గుప్తా గత నాలుగేళ్లుగా పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్ కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు. మహిళ కొన్ని రోజుల క్రితం పూణే నుంచి ఇచ్చికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు టీమ్‌గా ఆదివారం మధ్యాహ్నం ట్రెక్కింగ్ కోసం కారులో బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కాలినడక ప్రారంభించారు. వాతావరణం మారడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా.. గుప్తా, ప్రణీతలు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, గుప్తా తనకు మార్గం తెలుసని చెప్పడంతో ప్రణీత, కుక్క ముందుకు వెళ్లారని అధికారులు తెలిపారు.
ఇద్దరు చాలా సేపటి తర్వాత కూడా తిరిగి రాకపోవడంతో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసి, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏటవాటు ప్రాంతంలో హిమపాతం వల్ల ఇద్దరు కిందికి జారి పోయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు చనిపోయిన తర్వాత కుక్క అక్కడే ఉంది మృతదేహాలకు రక్షణగా నిలిచింది. ఏడుస్తూ, సాయం కోసం మొరుగుతూనే ఉంది.