హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీని (Congress) మరో రాజకీయ సంక్షోభం వెంటాడుతోంది. ఈసారి హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) వంతు వచ్చింది. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖును ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్ హాజరయ్యారు.
సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరగనుంది.