1. నేడు హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్‌సింగ్ ప్రమాణం. డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణం. ఉదయం 11 గంటలు సుఖ్విందర్ ప్రమాణ స్వీకారం.
2. నేడు నెక్లేస్ రోడ్డులో ఇండియన్ కార్ రేసింగ్ లీగ్. ట్యాంక్‌బండ్, నెక్లేస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు. గత నెల 19, 20న ఐఆర్‌ఎల్ తొలి రౌండ్ పోటీలు పూర్తి.
3. నేడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ. ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి సీబీఐ బృందం. కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్న సీబీఐ అధికారులు.
4. నేడు గోవా, మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.
5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రవాస్ యోజన లో భాగంగా నేడు భీమవరం చేరుకోనున్నారు.
6. నేడు శ్రీకాకుళం పట్టణంలో జనసేన సమీక్షా సమావేశాలు. పాల్గొననున్న పార్టీ పిఎసి చైర్మన్ నాదేండ్ల మనోహార్.
7. నేడు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (మం) డోకులపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొననున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు..
8. అనంతపురం బుక్కరాయసముద్రం మండలం SRIT కళాశాలలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన వైసిపి నాయకులతో సమీక్ష సమావేశం.
9.పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు , కొట్టు సత్యనారాయణ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు.
10.నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో నేడు అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు, అమ్మవారికి చీరే సారే బోనాలు సమర్పించ నున్న భక్తులు.