ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్‌లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి.
హిమాచల్‌ప్రదేశ్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. గత కొద్ది రోజులు ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. ఓ కుండపోత వర్షాలు.. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు.
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సుఖు తెలిపారు.
Cow Cess: మందుబాబులకు షాక్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్.. 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో మద్యం బాటిళ్లపై రూ. 10 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్…