Himachal Rains: హిమాచల్‌ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సిర్మౌర్‌లో వరద హెచ్చరిక జారీ చేశారు.
Breakfast: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మండి, బిలాస్‌పూర్, చంబా, కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుండి వాయువ్య భారతదేశాన్ని తాజా పశ్చిమ భంగం ప్రభావితం చేయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 21 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ, మధ్య కొండలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఎత్తైన ప్రాంతాలలో మోస్తరు వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల దృష్ట్యా.. రైతులు పంటలు, పండ్లకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Jyotiraditya Scindia: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా..? రాహుల్‌పై విమర్శనాస్త్రాలు
వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 1, సెప్టెంబర్ 15 మధ్య రుతుపవనాల సమయంలో మొత్తం 840.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి హిమాచల్‌లో సాధారణ వర్షపాతం (689.6 మి.మీ) కంటే 22 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు కురవడంతో.. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.8,680 కోట్ల నష్టం వాటిల్లింది. జూన్ 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి వర్షం, సంబంధిత సంఘటనల కారణంగా సుమారు 272 మంది మరణించారు. ఇటీవల.. హిమాచల్ లో వర్షం, కొండచరియలు విరిగిపడిన అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!