వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ODR) ప్రకారం, భారతదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగినట్లు తెలిసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 268,923 మంది విద్యార్థులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నారు.