ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు. ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు…