ఎప్పుడూ కూల్ గా ఉండే యూకే ప్రస్తుతం మండిపోతోంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీగా ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో బ్రిటన్ వాతావరణ శాఖ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే సోమవారం, మంగళవారాల్లో ఇంగ్లండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచానా వేసింది. గతంలో ఉన్న రికార్డులను తిరిగిరాసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో…
ఈశాన్య భారతం వరదల, భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియాలు విరగిపడ్డాయి. ముఖ్యంగా అస్సాంలోని 28 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. 150 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 40కి పైగా సైనికులు, ప్రజలు చనిపోయారు. ఇక అన్ని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికించాయి.…
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సుమారు రెండు నుంచి మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని హైదరాబాద్…