తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులను కట్టడి చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. కేసుల నమోదును తక్కువగా చూపుతున్నారని పేర్కొన్న పిటిషనర్.. తక్కువ కేసులు చూపడంతో కేంద్రం నుండి మందులు తక్కువగా సరఫరా అవుతున్నాయి అని అన్నారు. బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ దిగుమతికి కేంద్రాన్ని ఆదేశించాలి. బ్లాక్ ఫంగస్‌తో ప్రాణాలు పోతున్నాయి.. కేసుల నమోదు లెక్కలు రాష్ట్రం ప్రకటించాలి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్వర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. అయితే…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు..…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు…
దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు అయింది. నెల రోజుల క్రితం సంగం డైరీ కేసులో నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ… ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దూళిపాళ్ల. అయితే ఇవాళ.. సంగం డెయిరీలో అవకతవకలు కేసులో A1 ముద్దాయి ధూళిపాళ్ళ నరేంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు ధూళిపాళ్ళ నరేంద్ర విజయవాడలోనే ఉండాలని..విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలుపాలని హై…
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. రేగు మహేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం సరైంది కాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు… రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. సమ్మర్ వేకేషన్ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది. కాగా, ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికాలం…
ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు…
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ నీలం సాహ్ని సమాలోచనలు చేస్తుంది. ఈ తీర్పు పై అప్పీల్ కి వెళ్లే అంశం పై న్యాయ నిపుణులు తో చర్చిస్తున్నారు ఎస్ఈసీ. ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఎస్ఈసీ నీలం సాహ్ని. ఎన్నికలు రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పు వివరాలను ఎస్ఈసీకి వివరించింది ఎస్ఈసీ కార్యాలయం. నిబంధనలు మేరకే ఎన్నికలు నిర్వహించామంటున్న ఎస్ఈసీ……
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, సుప్రీంకోర్టు.. రఘురామను ఆస్పత్రికి తరలింపు అంశంపై ఉత్తర్వులు ఈరోజే ఇచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు ఏఏజీ..…