హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ జరిగింది. ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేసారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన మరోసారి విచారణ చేపట్టిన పోలీసులు… మే 20న నా అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేసారు. ఏప్రిల్…
బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పరిస్థితి ఏదో చేయబోతే.. ఇంకా ఏదో అయినట్టుగా తయారైంది.. కరోనా బాధితుల కోసం ఆయన ఫాబీఫ్లూ ట్యాబెట్లను పంపిణీ చేస్తే.. అసలే ట్యాబెట్లు దొరకక కష్టాలు పడుతున్న సమయంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్లను అక్రమంగా నిల్వ చేశారని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖలైన పిటిషన్‌లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టి.. గౌతం గంభీర్ ఫౌండేషన్ అక్రమంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని.. ఈకేసులో గంభీర్ ఫౌండేషన్ దోషిగా…
ఆనందయ్య ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం. రోజుకి 15 నుంచి 20…
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జులై నెలలో పరీక్షల నిర్వాహణపై సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం తరపు వాదనలు విన్న తరువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కరోనా విజృంభిస్తుండటంతో వాయిదా వేశారు.…
ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా వాటికి అనుమతిని ఇచ్చింది. కాగా, నేడు ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి…
లాక్‌డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని టీఎస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు, వారి క్లర్కులు స్టెనోలను అనుమతించాలని… బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దు. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగానిస్తామని హైకోర్టు…
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల…
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది.. దీంతో.. కంట్లోవేసే చుక్కుల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు ఆనందయ్య తరపు న్యాయవాది.. ఆ మందుపై నివేదికను గురువారం లోగా అందించాలని హైకోర్టు వ్యాఖ్యానించగా.. కంట్లో వేసే చుక్కులు కె అనే మందును అనుమతించకపోవడానికి శాంపిల్ ఇవ్వకపోవమే కారణంగా చెప్పింది ప్రభుత్వం.. అయితే, ఈ రోజు కె మందు శాంపిల్ ఇస్తామని తెలిపారు ఆనందయ్య…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.. దీనిపై రాజకీయ విమర్శలు దుమారమే రేపాయి.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.. మరోవైపు.. బీజేపీయే ఈ హింసకు కారణమంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. అయితే.. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో బాధితుల పునరావాసానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కోల్కతా హైకోర్టు… రాష్ట్ర…
ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్…