రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహాద్దుల్లో అంబులెన్స్ ను అడ్డుకోవడంపై కూడా…
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో…
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన అమర రాజా కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమర రాజా పరిశ్రమను మూసివేయాలని ఇటీవలే పీసీబీ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం హైకోర్టులో కేసులు ఫైల్ చేసింది. ఈ కేసును విచారించిన హైకోర్టు పీసీబీ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. విద్యుత్ ను పునరుద్ధరణ చేయాలనీ ఆదేశించింది. జూన్ 17 వ తేదీలోగా ఆదేశాలను అమలు చేయాలనీ పీసీబీకి సూచించింది హైకోర్టు. …
ధూళిపాళ్లని ఏసీబీ కస్టడీకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం 5 రోజుల కస్టడీ పిటిషన్ సవాలు చేస్తూ ధూళిపాళ్ల వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే ఇచ్చింది కోర్టు. అయితే నేడు పూర్తి స్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం ధూళిపాళ్లను మూడు రోజులు , ఎండీ గోపాల కృష్ణ, సహకార శాఖ అధికారి గుర్నాధం ను రెండు రోజులు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి జైలులోనే ఏసీబీ విచారించాలని…
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే..…
తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఉదయమే కేసు ఉన్నా మధ్యాహ్నం వరకు సమయం కోరిన ప్రభుత్వం.. మధ్యాహ్నం తర్వాత కూడా నిర్ణయం వెల్లడించలేదు అడ్వాకేట్ జనరల్. మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు..నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏజీ.…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం అందులో 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందినట్లు అలాగే కరోనా పాజిటివ్ రేటు 3.5% ఉంది అని ప్రభుత్వం తెలిపింది. పరీక్షలు ఇంకా…
తమిళనాడులో కరోనా విజృంభనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయభాస్కర్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ పిటిషన్ వేశారు విజయభాస్కర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు… అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశించింది.…
న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ న్యాయవాద దంపతుల హత్య కేసు పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. అయితే వామన్రావు, నాగమణి హత్యకేసులో దర్యాప్తు చేసి సేకరించిన వివరాలు కోర్టుకు సమర్పించారు పోలీసులు. 15 ఎఫ్ఎస్ఎల్ నివేదికలు అందాయని హైకోర్టుకు తెలిపిన పోలీసులు… 15 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 32 మంది ప్రత్యక్షసాక్షుల వాగ్మూలాలు కోర్టులో నమోదు చేసారు పోలీసులు.…
తెలంగాణ ప్రభుత్వంపై హై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన వివరాలేవీ ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది హై కోర్టు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని ఫైర్ అయింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని పేర్కొంది హై కోర్టు. పబ్ లు, బార్లపై క్లబ్ లపై చర్యలు ఏమయ్యాయి ? హై కోర్టు సీరియస్ అయింది. మీకు ఆదాయమే ముఖ్యమా…