వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది…
సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్ పై సీరియస్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొత్త టెక్నిక్‌తో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది అశ్వని కుమార్… అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు.. ప్రైవేట్ వ్యూస్‌ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్‌లో పేర్కొన్నారు.. Read Also: Goutham Reddy passes…
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ‍్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని…
రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ…
ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించింది తెలంగాణ సర్కార్.. భూముల వేలం ద్వారా వేల కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరాయి.. అయితే, ఈ మధ్యే కోకాపేట, ఖానామెట్‌లో జరిగిన భూముల వేలంపై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు.. విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా చూపింది… ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.. భూముల విక్రయంలో ప్రభుత్వం…
హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు…
ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని.. ఈ విషయంలో పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టిపెట్టాలని లేఖలో కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Read Also: ఎర్రజెండా వెనుక పచ్చజెండా…
కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.…
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె కేసుకి సంబంధించి హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన…