TGPSC: గ్రూప్ 1 పై కీలక నిర్ణయం.. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ
- తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో కీలక మలుపు
- సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పిటిషన్లను కొట్టివేసి సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పు పరీక్షా ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తుందని, అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది. దీంతో, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది.
Also Read:MLA Rajagopal Reddy: ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదే
Also Read
మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
Also Read:Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఏడుగురు..
పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తుది తీర్పును వెల్లడించింది. కాగా 563 గ్రూప్ వన్ పోస్ట్ ల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది..10th మార్చ్ న మార్క్స్ ను అభ్యర్థుల లాగిన్ ID లకు పంపించింది. వచ్చిన మార్క్ ల పై అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్ కి అవకాశం ఇచ్చింది సర్వీస్ కమిషన్.. మార్చి 24 వరకు రీ కౌంటింగ్ కు అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్.. ఈ ఏడాది మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!