Padi Kaushik Reddy : తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, రీ-వాల్యుయేషన్ లేదా రీ-ఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు సూచించిందని ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కామ్ జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన, బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ విచారణను కోరాలని సూచించారు. సీఎంఓ ఆఫీసు నుంచే ఈ పోస్టులు అమ్ముడుపోయాయని, రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని ఆయన విమర్శించారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ జనతా గ్యారేజ్‌లా మారిందని, గ్రూప్-1 అంశంపై తాను మాట్లాడినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ చేయాలని చెప్పగా, సీపీని ప్రశ్నించడంతో వారు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. “రేవంత్ రెడ్డి లాగా మేము ఫోజులు కొట్టము,” అని ఆయన సెటైర్ వేశారు.
కేసీఆర్ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సమర్థవంతంగా వచ్చాయని గుర్తు చేసిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీక్ జరిగితే కేసీఆర్ వెంటనే పరీక్షను రద్దు చేశారని, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను తూతూమంత్రంగా పెట్టారని విమర్శించారు.
Narayanan: ఆపరేషన్ సిందూర్‌కి 400 మందికి పైగా శాస్త్రవేత్తల కృషి.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారని ఆరోపించిన ఆయన, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అలయన్స్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గగ్గోలు పెట్టారని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవకతవకలు జరిగినా బండి సంజయ్ నోరు మెదపకపోవడం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ములాఖత్‌లో నడుస్తున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చదువుతున్నారని, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, పాల్వాయి హరీష్ కుమ్మక్కై మాట్లాడుతున్నారని విమర్శించారు. యూరియా సరఫరాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ అయ్యారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేతలు మరిన్ని డిమాండ్లు చేస్తున్నారు.
Manipur BJP: ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..!