ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. "ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి"అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.
హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. "కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు.
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్.
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది.
Tamilnadu : ప్రస్తుతం దేశం మొత్తం కోల్‌కతా నిర్భయ గురించి మాట్లాడుతోంది. కోల్‌కతా నిర్భయకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మహిళల భద్రత కోసం డిమాండ్లు ప్రతిచోటా లేవనెత్తుతున్నాయి.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
మూడు రాజధానుల వ్యవహారంపై భారత అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సర్కార్… మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత.. ఈ అంశంపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ప్రభుత్వం పేర్కొంది… అయితే, రాజధాని అంశం చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. కాగా, చట్టాలు చేయటానికి శాసనసభకు ఉన్న అధికారాలను…
రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదని ఆయన వెల్లడించారు. రాజధానిపై మూర్ఖంగా మరో చట్టం చేసినా…
అమరావతి రాజధాని విషయంలో వచ్చిన కోర్టు తీర్పుపై విజయనగరం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపి.రాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అక్కడ రైతులు దీపావళి పండుగ చేసుకుంటున్నారన్నారు. 807 రోజులు పాటు రైతులు చేసిన త్యాగ ఫలమే ఈ తీర్పు అని ఆయన అన్నారు. అమరావతి రైతుల చేసిన ధర్నాలు పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, తద్వారా ఎన్నో దాడులు చేశారు. మహిళలని చూడకుండా వారిపైన కూడా దాడి చేశారని…