గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్పందన ప్రకటించారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వానికి “చెంపపెట్టు”గా అభివ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్.. కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: Hydra Marshals: వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు..…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.
వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు.
Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్‌ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన…
Vishnupriya : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు మొత్తం 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి, వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తనపై…
తెలంగాణ భవన్‌లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది.. తొందరగా వెళ్లి కలవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత.. ఇదొక లొట్టపీసు కేస్.. వాడు ఒక ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఆయన పీకేది ఏమి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం…
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్‌ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ ప్రశ్నించింది. “అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశాం. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశాం. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేశాం. 46 కోట్ల రూపాయలను విదేశీ…
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది.
ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసు ఇచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.