Highcourt Telangana : తెలంగాణలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా గుర్తించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల అభ్యర్థన ప్రకారం నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీతో పాటు అమీన్‌పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామపంచాయతీలను కలిపి నెక్కొండ మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
AP New Districts: కొత్త జిల్లాల డిటైల్డ్ రిపోర్ట్ ఇదే..!
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నోటిఫికేషన్‌కు ముందే మున్సిపాలిటీ గుర్తింపు ఇవ్వాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం వర్ధన్నపేట, నర్సంపేట, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. నెక్కొండను మున్సిపాలిటీగా ప్రకటిస్తే మొత్తం సంఖ్య నాలుగుకు చేరుతుంది. మున్సిపాలిటీగా మారితే ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
2026 T20 World Cup: 2026 టీ20 ఫైనల్ మ్యాచ్ ఈ రెండు టీంలకే.. : కెప్టెన్ సూర్య