ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
వేసవి కాలాన్ని విద్యుత్ డిమాండ్ అధిగమించింది. ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈరోజు 14136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని ట్రాన్స్ కో, జేఎన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.