Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది.
Israel PM: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు.
Israel–Hezbollah conflict: వైమానిక, భూతల దాడులతో హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది.
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది.
Naim Qassem : హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీమ్ ఖాసిం మొదటి ప్రసంగం ప్రసారం అయింది. ఈ ప్రసంగంలో నయీమ్ ఖాసిం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హత్య చేస్తానని బెదిరించారు.
Israel Hezbollah War: ఇజ్రాయెల్, లెబనాన్ కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది.
Israel: హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరు భావిస్తున్నారు.
Israel - Hezbollah: ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు.
Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది.
హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.