రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు..
రీల్ లైఫ్ హీరోలందరూ నిజ జీవితంలో కూడా హీరోలు కాలేరు కానీ సౌత్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా తన మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు.