మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం…
Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై…
తమిళ్ హీరో జీవా ఓ రిపోర్టర్‌తో వాగ్వాదానికి దిగారు. హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది కదా.. అలాంటి సంఘటనలు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయా? అని రిపోర్టర్ ప్రశ్నించగా జీవా కోపోద్రిక్తుడయ్యారు. ఇలాంటి చోట ఏం ప్రశ్నలు అని అంటూ.. నీకు అసలు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం తేనిలోని ఓ టెక్స్‌టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా…
JP Nadda: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలను హేమా కమిటీ వెలుగులోకి తీసుకువచ్చింది. పలువురు స్టార్ యాక్టర్స్ మహిళా టెక్నీషియన్స్, నటీమణులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి తోడు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న కొన్ని వేధింపుల గురించి చెప్పడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.
Radikaa Sarathkumar About Secret Cameras: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నటీమణుల కారవాన్‌లలో కొందరు…
2nd FIR against Malayalam Actor Jayasurya: మలయాళ నటుడు జయసూర్యపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి ఫిర్యాదు మేరకు ఆయనపై 354, 354A(A1)(I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నటి నుంచి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆపై కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. త్రిసూర్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును…
Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన…
Hema Committee report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపుల గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించింది. 2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.