కావాలనే నటితో కౌగిలింత సీన్‌కు 17 టేకులు.. సంచలన విషయాలు వెలుగులోకి !
- మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి జస్టిస్ హేమా కమిటి ఏర్పాటు
- కావాలనే నటితో కౌగిలింత సీన్‌కు 17 టేకులు
- సంచలన విషయాలు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీ ద్వేషం ప్రబలిందని నివేదికలో పేర్కొన్నారు. పలువురు ప్రముఖ నటీమణులు సైతం లైంగిక వేధింపులకు అంగీకరించాలని బలవంతం చేశారని కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. హేమ కమిటీ నివేదికలోని 55 – 56 పేజీలు మలయాళ సినిమాల్లో లైంగిక నేరాలను గురించి ప్రస్తావించారు. మలయాళ సినిమాల్లో లైంగిక వేధింపులు ఎక్కువ అని సినిమాలో ఛాన్స్ రావాలంటే సర్దుకుపోవాల్సిన వాతావరణం నెలకొందని కమిటీ తేల్చింది.
Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?
Also Read
ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించడం లేదు. ఫిర్యాదు చేస్తే కుటుంబానికి బెదిరింపులు వస్తాయని భయపడుతున్నట్లు పేర్కొన్నారు. శృంగార అవసరాలకు అనుగుణంగా లేని వారిని చిత్రసీమలో ఒక ముద్రవేసి తొలగిస్తారని, దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిని కూడా సినిమాల నుంచి తొలగిస్తారని నివేదికలో పేర్కొన్నారు. మలయాళ సినిమాని ఓ మాఫియా గ్యాంగ్ కంట్రోల్ చేస్తుందని, సినిమాలో నటించేందుకు వస్తే.. తమకు లొంగకపోతే చిత్రహింసలకు గురిచేస్తారని అంటున్నారు. లైంగిక వేధింపులకు గురైన ఓ నటిని కౌగిలించుకునే సన్నివేశంలో ఓ హీరో ఆ సన్నివేశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కావాలనే 17 టేక్స్ తీసుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడు నటుడ్ని తిట్టలేదని చెప్పడంతో తాము షాక్ అయ్యామని హేమ కమిటీ నివేదికలో నమోదు చేసింది. ‘లైంగికంగా లొంగిపోయే వ్యక్తులకు మాత్రమే మంచి ఆహారం లభిస్తుంది, నటీమణులు నగ్నంగా నటించాలని కూడా పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తోందని అన్నారు. దర్శకులు, నిర్మాతలు అడుగుతున్నారని, అలా చేయమని ఒత్తిడి చేస్తున్నారనే షాకింగ్ సమాచారం కూడా ఉందని హేమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!