Mohanlal-AMMA: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!
- మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం
- హేమ కమిటీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- ఆఫీస్ బాయ్‌గా కూడా చేయనన్న మోహన్ లాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఇక మోహన్ లాల్ మరోసారి అమ్మ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆయన స్పందించారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అమ్మ ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్ లాల్ చెప్పారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Game Changer Poster: ‘గేమ్ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!
‘అమ్మ అధ్యక్షుడిగా నేను మరోసారి ప్రమాణం చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అమ్మ ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం నాకు ఇష్టం లేదు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో దిగ్భ్రాంతికి గురయ్యా. మేం మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని చెప్పమని అందరూ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమదే. హేమ కమిటీ రిపోర్ట్ ఎన్నో సమస్యలను బయటపెట్టింది. ఎన్నో విషయాలు బహిర్గతమైన తర్వాత ప్రతిఒక్కరూ అమ్మనే ప్రశ్నించారు’ అని మోహన్ లాల్ అన్నారు. ప్రస్తుతం అమ్మకు తాత్కాలిక పాలకమండలి ఉంది. త్వరలో అమ్మ కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటామని మాజీ ఉపాధ్యక్షుడు జయన్ చేర్యాల, సురేష్ గోపి సూచనప్రాయంగా తెలిపారు. జూన్‌లో అమ్మ జనరల్ బాడీ, ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?