Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Tecno Camon 50 Ultra 5g Launched 144hz Amoled Display 50mp Triple Cameras 6500mah Battery

144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

Published Date :March 3, 2026 , 10:27 am
By Kothuru Ram Kumar
  • Camon 50 Ultra 5G మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల
  • 6.78 అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్.
  • 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ
  • 7.4mm సన్నని బాడీ, 178 గ్రాముల తక్కువ బరువు.
  • IP68, IP69, IP69K రేటింగ్‌లతో ధూళి, నీటి నిరోధకత..
144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tecno Camon 50 Ultra 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) ‘కామోన్’ (Camon) సిరీస్‌ లో అత్యంత శక్తివంతమైన మోడల్ Tecno Camon 50 Ultra 5Gను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మొబైల్ ఫోటోగ్రఫీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్.. అధునాతన కెమెరా సెన్సార్లు, AI ఆధారిత ఫీచర్లు, అత్యంత ధృడమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించేలా దీనిని తాయారు చేశారు.

కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్‌, 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం అత్యంత స్మూత్‌ గా ఉంటుంది. కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ‘ProXDR’ ఐ-కేర్ టెక్నాలజీని అమర్చారు. స్క్రీన్ రక్షణ కోసం “గొరిల్లా గ్లాస్ విక్టస్ 2” గ్లాస్‌ను ఉపయోగించారు.

TTD Laddu Controversy: నేటి నుంచి కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ స్టార్ట్

ట్రిపుల్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అందించారు. 50MP Sony LYT-700C ప్రైమరీ సెన్సార్ OIS సపోర్ట్‌తో వస్తుంది. ఇంకా 50MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో పోర్ట్రెయిట్ ఫోటోల కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మంచి దృశ్యాలను క్యాప్చర్ చేయగలదు. ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. AI 60x సూపర్ జూమ్, గ్లేర్ రిమూవర్, షాడో రిమూవర్ వంటి స్మార్ట్ ఎడిటింగ్ ఫీచర్లు ఫోటో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి.

ప్రాసెసర్:
మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్టిమెట్ (4nm) చిప్‌సెట్ ఈ ఫోన్‌ లో ఉపయోగిచారు. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ వంటి టాస్క్‌లను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై ఈ ఫోన్ నడుస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది.

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ ఫోన్ లో 6500mAh భారీ బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేపు వినియోగానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

ధృడమైన డిజైన్:
ఈ మొబైల్ కేవలం 7.4mm సన్నని బాడీ, 178 గ్రాముల తక్కువ బరువుతో ఉన్నప్పటికీ ఈ ఫోన్ అత్యంత రగ్గడ్ డిజైన్‌ తో తయారు చేయబడుతుంది. IP68, IP69, IP69K రేటింగ్‌లతో ధూళి, నీరు, అధిక పీడన వాటర్ జెట్‌ లను తట్టుకోగలదు. నీటిలో 2 మీటర్ల లోతు వరకు సురక్షితంగా పని చేయగలదు. ‘అండర్ వాటర్ మోడ్’ ద్వారా నీటి అడుగున ఫోటోలు తీసే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఈ మోడల్, త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Smartphone News
  • technology news
  • Tecno Camon 50 Ultra 5G
  • Tecno Camon 50 Ultra 5G Features
  • Tecno Camon 50 Ultra 5G Launch

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!

  • Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..

  • Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

ట్రెండింగ్‌

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions