ఈసారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది. పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో ఈరోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
Read Also: Death Penalty: “ఉరితీసే విధానం”పై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Margani Bharatram: ఆ అరెస్టుల్లో రాజకీయ దురుద్దేశం లేదు