Rain Problems in Hyderbad: గత మూడు రోజులుగా కురుస్తు్న్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వర్షాలతోపలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంచవటి కాలనీ మునిగిపోయింది. వరద నీరు ఇండ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫిరంగీ నాలాలు కబ్జా చేయడంతో కాలనీలోకి వరద నీరు చేరుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, పట్టించుకునే నాథుడు లేకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించినట్లు స్థానికులు వాపోతున్నారు.
Also Read: Children Died: నీటి గుంతలో పడి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఘటన
రాజేంద్రనగర్ శాస్త్రీపురం మదీనా కాలనీలోకి వరద నీరు భారీగా చేరడంతో కాలనీ అంతా జలమయమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలో ఉన్న సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడి పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల వరద నీరు వెళ్లే దారి లేక ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు దిగి.. మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు.
Also Read: Rains Effect: జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
కుత్భుల్లాపూర్ గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లేవ్‌లోకి మోకాలు లోతు నీరు వచ్చిచేరింది. గడిచిన రాత్రి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. కాలనీలో వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాక్స్ నాలా పనులు అర్ధాంతరంగా, ప్రణాళిక లేకుండా మధ్యలో మొదలు పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్‌గంజ్, కిషన్‌గంజ్, మహరాజ్‌గంజ్, ఫిల్ఖాన, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్‌నగర్‌లోని సాయికృష్ణ అపార్ట్‌మెంట్ లోనికి వరద నీరు చేరడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.