Heavy Rains in Uttar Pradesh: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వరుస వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ వరదలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మొదలు సోమవారం తెల్లవారు జాము వరుకు ఆగకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఇలాంటి పరిస్థితే మరో నాలుగురోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంది.
Also Read: Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్
ఒక్కరోజు వ్యవధిలోనే 19 మంది ఈ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పొయారు. పలు పాంత్రాల్లో ఇళ్ల పై కప్పులు కూలిపోయాయి. దీని కారంణగా ఇద్దరు చనిపోయారు. మరణించిన వారు సోదరులు కాగా వారి వయసు ఒకరిది 17 సంవత్సరాలు, ఒకరిది 13 సంవత్సరాలు. అంతేకాకుండా వర్షాల కారణంగా చెరువులలో కూడా నీటి మట్టం పెరిగింది. దేవరియాలో 9 ఏళ్ల బాలిక చెరువు వద్ద స్నానం చేస్తూ వరద నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని చోట్లు పశువులు చనిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఏకంగా 140 గొర్రెలు బలైపోయాయి. వీటికి తోడు పిడుగులు పడి కూడా జనం, పశువులు మరణిస్తున్నారు.
రాష్ట్రంలో లఖ్‌నవూతోపాటు బారాబంకీ, ప్రతాప్‌గఢ్, కన్నౌజ్, ముజఫర్‌నగర్ సహా 22 జిల్లాల్లో 24 గంటల్లో 40 మి.మీ.కుపైగా వర్షాలు కురిశాయి. సుమారు 173 గ్రామాలు ఈ వరదల కారణంగా ప్రభావితం అవుతున్నాయి. 56 వేల మంది వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఉత్తరప్రదేశ్ లో వర్షాల కారణంగా రైల్వే స్టేషన్ లు కూడా మునిగిపోయాయి. బారాబంకీలో వర్షాలకు రైలు పట్టాలు నీటమునిగాయి. దీంతో రైళ్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లో ఇదే విధంగా వరదలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.