హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేసింది.. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని కారణం.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడగా, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు వీస్తున్నాయని… వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.