Rains in Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరానికి నైరుతి రుతుపవనాలు పలకరించాయి. నిన్నటి నుంచే నగరమంతా చల్లబడింది. అర్థరాత్రి తొలకరి జల్లులతో భాగ్యనగం తడిసింది. ఇన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణం చల్లబడటంతో .. ఊరిపి పీల్చుకున్నారు. రాగల మూడు రోజుల వరకు ఇదే వాతావరణం కనిపించనుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, రాబోవు మూడు రోజుల వరకు భారీ వర్ష సూచనల నేపద్యంలో జోనల్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పై సమీక్షా నిర్వహించారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లపై, రోడ్లపై, గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి, వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకురాగలరని తెలిపారు.
రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదని అన్నారు. సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు.
విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సమస్యలు సంస్థ దృష్టికి తీసుకురాగలరని రఘుమా రెడ్డి సూచించారు.
Chhattisgarh: బోరు బావిలో బాలుడు.. 60 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..