Rain in Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా, అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది. Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..…
Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హయత్ నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , విద్యుత్…
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ఉప్పల్, ఎల్‌బి నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా పలు ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి పరిస్థితిని మరింత దిగజార్చింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం, కార్యాలయానికి వెళ్లేవారు ఇళ్లకు…
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు (నేడు, రేపు, ఎల్లుండి) వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…
Rains Updates: నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
Weather Warning: నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. m. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Hyderabad People: వర్షం వస్తే చాలు భయపడాల్సి వస్తుందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాపూర్ వాసులు, స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Potholed Roads: నగరంలోని రోడ్లన్నీ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.