నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఇటు రైతులు, అటు తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతులు రుతుపవనాల కోసం ఎదురుచూస్తుంటే.. భానుడి భగ భగల నుంచి ఉపశమనం కోసం తెలంగాణ వాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెర దించే విధంగా సోమవారం సాయంత్రం తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్ వరకు విస్తరించిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే..…
భానుడి భగభగకు హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో సతమతమవుతున్న వేళ… వరుణుడు కరుణించాడు.. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో.. నగరంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం…
నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ…
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికీ ఏపీ, తమిళనాడు తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఏపీలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ…
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం.. నల్లటి మేఘాలతో చిమ్మ చీకటిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరద నీరు భారీగా చేరుకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్,…
తెలుగు రాష్ట్రాలలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిచింది. దీంతో GHMC అలర్టయింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని నగరవాసులకు సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలకు సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ఎక్కువ…
అది పేరుకేమో మహానగరం.. తెలంగాణ కీర్తి కీరిటానికి బ్రాండ్ అంబాసిడర్.. అన్ని మతాలు, కులాలకు కేరాఫ్.. మినీ భారతదేశంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక్క చిన్నవానకే అతలాకుతలం అవడం ఏమిటీ? అన్న ప్రశ్న ప్రతీఒక్కరి మనస్సులో మొదలుతోంది. వేల కోట్ల రూపాయాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకునే పాలకులు ప్రస్తుత దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గత పాలకుల తప్పిదమని ఒకరంటే ఇప్పుడున్న పాలకులదే తప్పని మరొకరు.. ఇలా విమర్శలు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు.…
హైదరాబాద్ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్ పేట, అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట…
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.…