భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వరద బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్లను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి తగ్గింది. ఇన్ ఫ్లో లక్షా 93వేల 710 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.…