ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే ఆలస్యంగా తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించడంలో కూడా మందగిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు హైదరాబాద్‌లోని నార్త్, వెస్ట్ ఏరియాల్లో నేటి రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షం దంచికొడుతోంది.…
నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. అయితే రుతుపవనాల విస్తరణ మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వెల్లడించారు. జూన్ 6 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న ఆయన.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి… గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.. కారైకాల్ – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుండగా.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై…
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ…