తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
High Temperature and Heat Waves: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రాష్ట్రాలను నిప్పుల కుంపటిలా మార్చేశాడు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరుగతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఇవాళ పెరిగితే.. మరి కొన్ని జిల్లాల్లో రేపట్నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పలు జిల్లాలకు ప్రత్యేకంగా…
తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రలలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాలలో మార్చి నెలలోనే ఎండ దంచి కొడుతోంది. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది.
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. పలు రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.. రేపు 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని సంచలనం.. గెలిపించే బాధ్యత వాలంటీర్లదే..! తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల విషయానికి వస్తే..…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు…
మొన్నటి వరకు కరనా మహమ్మారి అమెరికాను భయపెట్టింది. వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయడంతో ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ తప్పనిసరిగా విధానానికి స్వస్తి పలికారు. అయితే, ఇప్పుడు ఆ దేశాన్ని మరోసమస్య వేధిస్తోంది. అమెరికాను హీట్ వేవ్ ఇబ్బందులు పెటుతున్నది. గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వేడిగాలులు వీస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభంలో 49 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో…