ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉష్ణ సూచికపై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు.
భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు బండులు పగిలే మండుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
దేశరాజదాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరిగింది. వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.