భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాలకు, వారి జీవనోపాధికి పెను ముప్పు పొంచి ఉంది అపి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ లో తెలింది.
Read Also: Rashmika Mandana : ఆ పీరియాడిక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక…?
ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందూ కుష్ హిమానీనదాలు 2011 నుంచి 2020 మధ్య కాలంలో 65 శాతం మేర వేగంగా కరిగిపోతునట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి.. వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం మేర కోల్పోవచ్చని నేపాల్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ తాజా రిపోర్ట్ లో తెలిపింది. దీని ఫలితంగా కాలక్రమేణా ఈ ప్రాంతంలోని 16 దేశాలలో ప్రవహించే 12 నదులలో మంచినీటి సరఫరా భారీగా తగ్గిపోవచ్చని కూడా పేర్కొనింది.
Read Also: Indian 2: కమల్ కే షాక్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది… షూటింగ్ నే ఆపేసారు
పశ్చిమాన అఫ్గనిస్థాన్ నుంచి తూర్పు మాయన్మార్ వరకూ 3,500 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో మరింతగా మంచు క్షీణిస్తుండటంతో భారీగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐసీఐఎంఓడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనంలో చైనా, భారత్ సహా ఆసియా ఖండంలోని 8 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Read Also: Harish Rao: 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథక పత్రాలు.. అందించిన హరీశ్‌రావు
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు హిందూ కుష్ హిమాలయాల అంతటా ఉన్న 200 హిమనీనదాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హిమానీనద సరస్సు విస్పోటం వల్ల వరదల ముప్పు ఎక్కువగా ఉంది అని నివేదిక పేర్కొంది. వ్యవసాయం, ఆహార భద్రత, మంచినీటి లభ్యత, ఇంధన వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలోని కొన్ని జంతు వృక్ష జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐసీఐఎంఓడీ హెచ్చరికలు జారీ చేసింది.