ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఉండడం కామన్ సమస్యగా మారింది. అయితే.. దీన్ని సీరియస్‌గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. కిడ్నీ శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవంలో ఒకటి. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది.
ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే కొంత మంది మహిళలు సడెన్‌గా బరువు పెరుగుతుంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. దాని ప్రభావం గుండె ఆరోగ్యంపై కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి గుండె జబ్బులు, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రాణాంతక సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.
మీ శరీరంలో వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ చేయాలి. బరువు తగ్గడం కోసమని.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ బ్రెడ్, పాస్తా, తీపి తృణధాన్యాలు, ఐస్ క్రీమ్‌లు మరియు స్వీట్లు, ఫుల్-క్రీమ్ డైరీ ఉత్పత్తులు, సాస్‌లకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు వంటి ఆహారాలు…
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కలిపిన పెరుగును ఉపయోగిస్తే.. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది.
మారుతున్న వాతావరణంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్.
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణమవుతున్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువకులలో స్ట్రోక్ కూడా పెరుగుతోందని పరిశోధకులు కనుగొన్నారు. స్ట్రోక్‌ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా లేనప్పుడు లేదా మెదడులోని రక్త నాళాలు కొన్ని కారణాల వల్ల పగిలినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.
రక్తపోటు (బిపి) అనేది మన ఆరోగ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే, ఇది మన ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తిని కొలుస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 mmHg ఉంటుంది.
మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మనం మన దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది.