కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. నిపుణులు చెప్పిన దాని కన్నా అధిక రెట్లు కరోనా వేగంగా వ్యాపించింది. కోవిడ్19 మరణాలు సైతం అధికంగా సంభవించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో కరోనా కేసులలో, మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం తప్ప మహమ్మారిని అరికట్టేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కరోనా థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది. కరోనా తొలి, రెండో…
ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించాల్సిందే. అలా ఆరోగ్యంగా ఉంచే, ఎప్పుడూ మన వంట గదిలో లభించే వాము వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? వాము మంచి ఔషధపు మొక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.…
ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. …
సాధారణంగా వృద్దాప్యంలోకి వచ్చిన తరువాత గతం మర్చిపోతుంటారు. అది సహజం. కానీ, 37 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన గతాన్ని మర్చిపోయాడు. అదీ నిద్రనుంచి లేచిన వెంటనే అలా తన గతాన్ని మర్చిపోయి, 16 ఏళ్ల చిన్న పిల్లవాడిగా భావించి స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. భర్త విచిత్రమైన పరిస్థితిని చూసి భార్య షాక్ అయింది. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని భార్య చెప్పినా భర్త నమ్మలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.…
కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని సమయంలో నిరోధక శక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషించారు. విటమిన్లు, సప్లిమెంట్లు, డైట్, వ్యాయామం వంటివాటి ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిసారించినట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నివేదికలో పేర్కొన్నది. Read: “హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్ ఈ నివేదిక ప్రకారం, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం ఏకంగా భారతీయులు రూ.15 వేల కోట్ల…
శరీర నిర్మాణంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. విటమిన్ డి శరీరంలో తగిన పరిమాణంలో ఉంటే, కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని, కరోనాపై పోరాటానికి విటమిన్ పాత్ర కీలకం అని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో తేలింది. ఆరునెలలపాటు విటమిన్ డి పాత్రపై వైద్యబృందం పరిశోధన చేశారు. పల్స్ ఢీ థెరపీ పేరుతో ఈ పరిశోధన జరిగింది. విటమిన్ డి శ్వాస కోశ వ్యాధుల నుంచి కాపాడుతుందని స్పానిష్ ఫ్లూ సమయంలో…
కరోనా కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగింది. కర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి అమలు జరుగుతుండటంతో కొంత సమయం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతులు ఉండటంతో ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా త్వరగా లేచే వారికి గుండె జబ్బులు, ఊబకాయం వంటివి దరిచేరే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేచే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.…
ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో వ్యత్యాసముంది. ఏకాంతంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మనిషిని కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. తాజాగా ఓ పరిశోధనలోనూ ఇదే తేలింది. ఒంటరిగా ఉండే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తేల్చింది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉండే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 1980లలో ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. 2570 మంది…
దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే…