సాధారణంగా వృద్దాప్యంలోకి వచ్చిన తరువాత గతం మర్చిపోతుంటారు. అది సహజం. కానీ, 37 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన గతాన్ని మర్చిపోయాడు. అదీ నిద్రనుంచి లేచిన వెంటనే అలా తన గతాన్ని మర్చిపోయి, 16 ఏళ్ల చిన్న పిల్లవాడిగా భావించి స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. భర్త విచిత్రమైన పరిస్థితిని చూసి భార్య షాక్ అయింది. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని భార్య చెప్పినా భర్త నమ్మలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, భార్య కొంత నచ్చజెప్పి భర్తను ట్రీట్మెంట్‌కు తీసుకెళ్లింది. అయితే, భర్తను పరీక్షించిన వైద్యులు షార్ట్ టర్మ్ మెమరీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడని, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత భార్య ఆ భర్తను తాను చిన్నతనంలో చదువుకున్న స్కూల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆ వ్యక్తి మెమరీలాస్ నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. చికిత్సకు స్పందిస్తున్నాడని, త్వరలోనే మామూలు స్థితికి వస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది.
Read: సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు !