రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది. ఫలితంగా ఇది డయాబెటిస్ రావడాన్ని నివారించడానికి లేదా డయాబెటిస్ రావడానికి ఆలస్యం అయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, బాదం తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసే గుడ్ హెచ్‌డిఎల్-కొలెస్ట్రాల్ స్థాయిలను (good HDL-cholesterol levels) మెరుగుపరుస్తుంది.
రోజుకు రెండుసార్లు బాదం తినడం వల్ల ప్రిడియాబెటిస్ నుండి టైప్ -2 డయాబెటిస్ (prediabetes to Type-2 diabetes) మారే దశను ఎదుర్కోవచ్చని ఈ అధ్యయనంలో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయిన ముంబైలోని సర్ వితాల్డిస్ థాకెర్సీ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ జగ్మీత్ మదన్ తెలిపారు.” కేవలం 12 వారాల వినియోగంలో ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచి, హెచ్‌బిఎ 1 సి స్థాయిలను తగ్గించడంలో ఆల్మండ్స్ ఎంతో చురుకైన పాత్ర పోషించాయి” అని మదన్ తెలిపారు. 275 మందిపై ఈ పరిశోధన జరిపారు. వారిలో 59 మంది పురుషులు, మరో 216 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒక బృందం మూడు నెలల పాటు ప్రతిరోజూ 56 గ్రాముల(340 కేలరీలు) పచ్చి బాదంపప్పును తినగా మరో కంట్రోల్ గ్రూప్ గోధుమ పిండి, శనగ పిండి (chickpea flour), ఉప్పు, భారతీయ సుగంధ ద్రవ్యాలను (Indian spices) ఉపయోగించి తయారుచేసిన రుచికరమైన చిరుతిండిని ఆహారంగా తీసుకుంది.
బాదం తీసుకున్న వారి సమూహంలో హెచ్‌బిఎ 1 సి (HbA1c) – ప్రీడియాబెటిస్, డయాబెటిస్‌కు రోగనిర్ధారణకు ఒక ప్రమాణంగా పనిచేసే దీర్ఘకాలిక రక్త చక్కెర (Long term blood sugar) నియంత్రణ కొలత – కంట్రోల్డ్ గ్రూపుతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అలాగే బాదం తిన్న వారిలో ఆహారం తీసుకోవడానికి ముందు ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లోనూ (fasting blood sugar) తగ్గుదల కనిపించింది.