భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…
చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బ్రీచ్ కాండీ హాస్పిటల్ వైద్యులు ప్రతీత్ సమదాని శనివారం తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత జనవరిలో లతా మంగేష్కర్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే నెల 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సంజ్ఞలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి…
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్…
సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత…