భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో ప్రొఫైల్ పొందుపరిచి ఉంటుంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కార్డును పేద ప్రజలకు అందేలా వైద్య అధికారులు చొరవ చూపాలని కిషన్ రెడ్డి కోరారు.
ఆరోగ్య మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ అన్ని డోసులు వేసుకోవాలి…నిర్లక్ష్యం చేయవద్దు. ఐదేళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వైద్య సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేశారు. ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Read Also: ఏదో ఒక దారి వెతుక్కునే పనిలో టీఆర్ఎస్ మాజీలు..