సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…
అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో కరోనా మహమ్మారి వ్యాపించటం, లాక్ డౌన్ వల్ల కాలు బయట పెట్టే అవకాశం లేకపోవటం పరిస్థతిని మరింత దిగజారుస్తోందట. కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ వల్ల కిరణ్ ఖేర్ ఒక్కో రోజు ఒక్కో లాంటి మూడ్ లో ఉంటారని అనుపమ్ చెప్పారు. ఆమె పాజిటివ్ గా ఉన్న రోజు ఫర్వాలేదు. కానీ, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్ వల్ల ఆమె ఒక్కోసారి మానసిక ఒత్తిడికి లోనవుతుందట. అటువంటప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండటం, ఎవ్వరూ వచ్చి, వెళ్లే దానికి అవకాశం లేకపోవటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందట. క్యాన్సర్ పేషంట్లకి వారి మనసు తేలిక పడేలా ఇతర అంశాలపై దృష్టి పెట్టటం చాలా అవసరం. కానీ, కరోనా వల్ల కిరణ్ ఖేర్ అది చేయలేకపోతున్నారట!
ఎంతో కష్టమే అయినప్పటికీ తన భార్య ట్రీట్మెంట్ కి బాగానే స్సందిస్తోందని అనుపమ్ ఖేర్ వివరించాడు. ఇప్పుడు గతంలో కంటే ఆరోగ్యం మెరుగైందని ఆయన చెప్పాడు. అయితే, తనతో పాటూ ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ సినిమాలో నటించిన హాలీవుడ్ టాప్ స్టార్ రాబర్ట్ డీ నీరో ఎప్పటికప్పుడు కిరణ్ ఖేర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నాడట. అంతటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీతో హాలీవుడ్ లో అనుపమ్ స్నేహం చాలా తక్కువ రోజులే కొనసాగింది. అయినా తాము నటించిన సినిమా ఎప్పుడో పూర్తైపోయినా రాబర్ట్ డీ నీరో ఇప్పటికీ ఫ్రెండ్ షిప్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడని అనుపమ్ వివరించాడు. తనకొచ్చిన సమస్యని గుర్తు పెట్టుకుని ఎప్పటికప్పుడు కాల్స్, మెసెజెస్, వీడియో మెసేజెస్ ద్వారా డీ నీరో ఆత్మ స్తైర్యాన్ని ఇవ్వటం గొప్ప విషయం అంటున్నాడు అనుపమ్! భార్య కిరణ్ ఖేర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయన తాను చేస్తోన్న హాలీవుడ్ ప్రాజెక్ట్స్ మధ్యలోనే వదిలేసి ఇండియాకి వచ్చేశాడు…