Food Poison : ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మందికి పైగా మానసిక రోగులు భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరణ్ అనే వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతిచెందాడు. ఇతర బాధితులను ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్సకు తరలించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆహారం…
పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు…
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏది పడితే అది ఎంత పడితే అంత కాకుండా పద్దతిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అండు కొర్ర, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. చిరుధాన్యాలను తినడం…
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దని హాస్పిటల్…
మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు.…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.
మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్…
సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు.
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు…
Pneumonia In Children: ప్రస్తుతం చలి వణికించేస్తోంది. ఇక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు జలుబు కారణంగా న్యుమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. న్యుమోనియా ఒక సాధారణ వ్యాధి అయినప్పటికీ, అది సంభవించినప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. పిల్లల్లో వచ్చే న్యుమోనియాకు సంబంధించిన విషయాలను…