Kidney Stones Alert: మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు అనేవి మినరల్స్, ఉప్పుల నిల్వలుగా ఏర్పడతాయి. ఇది మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, ఆ పదార్థాలు క్రిస్టల్స్ రూపంలో తయారై మూత్రపిండాల్లో చేరి రాళ్లు (Kidney Stones)గా మారతాయి. ఒకవేళ వీటి పరిమాణం చిన్నదిగా ఉంటే మూత్ర మార్గంలో చేరినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటానికి కారణాల్లో వంశపారంపర్యం, డీహైడ్రేషన్, ఆరోగ్య పరిస్థితులు ఉన్నా, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ఉన్న ఆక్సలేట్స్, క్యాల్షియం, యూరిక్ యాసిడ్, సోడియం వంటి పదార్థాలు మూత్రంలో పెరిగితే రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాళ్లు ఏర్పడే అవకాశం పెంచే కొన్ని ఆహారాలను తప్పించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు లిస్ట్ చూద్దామా..
పాలకూరలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో క్యాల్షియంతో కలిసితే క్యాల్షియం ఆక్సలేట్ స్టోన్లు ఏర్పడే అవకాశముంది. పాలకూర పోషకాలు కలిగిన ఆహారమే అయినా, ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం. ఇంకా బీట్రూట్ కూడా పాలకూర మాదిరిగానే అధిక ఆక్సలేట్ కలిగి ఉంటుంది. బీట్రూట్ లేదా బీట్రూట్ జ్యూస్‌ను తరచుగా తీసుకుంటే మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగే అవకాశముంది. వీటితోపాటు ఆల్మండ్, కాజూ, పీనట్ వంటి నట్‌లు ఆక్సలేట్ పరంగా అధికంగా ఉండే ఆహారాలు. అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
Minister Seethakka: పేదల కోసం పోరాడినందుకు కేసు… కోర్టు ఎదుట హాజరైన మంత్రి సీతక్క
ఇక ఈ లిస్ట్ లో డార్క్ చాక్లెట్ కూడా ఉంది. ఇందులోని కోకోలో కూడా అధిక ఆక్సలేట్ ఉంటుంది. అప్పుడప్పుడూ తినడంలో తప్పు లేదు కానీ, తరచూ ఎక్కువగా తినడం ప్రమాదకరం. అలాగే బ్లాక్ టీ కూడా ఆక్సలేట్‌లో రిచ్. రోజుకు చాలాసార్లు టీ తాగడం, ప్రత్యేకించి తగినన్ని నీరు తాగకుండా తాగితే, స్టోన్ రిస్క్ పెరుగుతుంది. తక్కువ ఆక్సలేట్ ఉన్న హర్బల్ టీలు మేలైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వీటితోపాటు రెడ్ మీట్ (పచ్చి మాంసం)లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచి, యూరిక్ యాసిడ్ స్టోన్లను కలిగించవచ్చు. కాబట్టి తీసుకోకపోవడమే ఉత్తమం.
Crime News: మరో ఆణిముత్యం.. భార్య చేతిలో భర్త బలి! మూడేళ్ల కుమార్తెను ఆరా తీయగా
ఇక చిప్స్, కెన్ సూప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రంలో క్యాల్షియం స్థాయిని పెంచి క్యాల్షియం స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి ఏదైనా మితమైన స్థాయిలో తింటే సరిపోతుంది. ఇక చాలామంది తరుచుగా తీసుకొనే కోలా డ్రింక్స్‌లో ఉన్న ఫాస్ఫారిక్ యాసిడ్ స్టోన్లకు దారి తీస్తుంది. షుగరీ బేవరేజెస్ యూరిక్ యాసిడ్ పెంచి, మూత్రంలో నీటిని తగ్గించి స్టోన్ రిస్క్‌ను పెంచుతాయి. కాబట్టి కొద్దిపాటిగా తీసుకుంటే సేఫ్ గా ఉండవచ్చు. ముఖ్యంగా విటమిన్ C అధికంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో ఆక్సలేట్‌గా మారుతుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా అధిక మోతాదులో తీసుకోవడం ప్రమాదకరం.