Eye Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ ఆహారాలు తినండి! గ్రద్ద లాంటి చూపు మీ సొంతం
- సర్వేంద్రియానాం నయనం ప్రధానం
- ఈ కాలంలో కంటి చూపు బలహీనంగా ఉన్నవారే ఎక్కువ
- చిన్న వయసులోనే కళ్లద్దాలు
- ఈ ఆహారాలు తింటే మెరుగైన చూపు మీ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల కంటి చూపు బలహీనం అవుతుంది. అంతేకాదు కంటి చూపుకు అవసరమైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా మరో కారణం. గ్రద్ద లాంటి చూపు మీ సొంతం కావాలంటే.. ఈ కింది ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
విటమిన్ ఎ:
కళ్లకు ఉత్తమమైన పోషకం విటమిన్ ఎ. రెటీనాకు తగినంత విటమిన్ ఎ అవసరం. సూర్యుడి హానికరమైన కిరణాల నుండి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ ఎ లేకుంటే మీ కళ్లు పొడిబారిపోయాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
క్యారెట్స్:
కళ్లకు మేలు చేయటంలో క్యారెట్లను మించినవి మరొకటి లేదు. క్యారెట్‌లోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
చిలగడదుంప:
చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) విటమిన్ ఎని పుష్కలంగా అందిస్తాయి. చిలకడదుంపలలో ఉండే బీటా కెరోటిన్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. కళ్లు పొడిబారడాన్ని తగ్గించడమే కాకుండా.. కంటి చూపును బలంగా ఉంచుతుంది.
ఆకుకూరలు:
ఆకుకూరలు తింటే కంటి చూపు బాగా ఉంటుంది. లుటిన్, జియాక్సంతిన్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. ఇవి సూర్యుడి హానికరమైన కిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి. పాలు, ఛీజ్, గుడ్డు (పచ్చసొన) వంటి వాటిల్లోనూ విటమిన్ ఎ ఉంటుంది. పుచ్చకాయలు విటమిన్ ఎ కి మంచి వనరులు.
విటమిన్ సి:
కంటి ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్‌గా విటమిన్ సి పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. వేయించిన ఆహారాలు, పొగాకు, సూర్య కిరణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసే అణువులు. విటమిన్ సి కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.
నారింజ పండు, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినాలి. క్యాప్సికమ్, టమోటాలు, స్ట్రాబెర్రీలు కూడా విటమిన్ సిని అందిస్తాయి. తాజా పండ్లలో కూడా విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. మంచి కంటి చూపు కోసం తీసుకొనే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సిలు ఉండేటట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఒమేగా-3 ఉండే చేపలను కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి. అన్నింటితో పాటు ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా కళ్లకు కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..