ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏది పడితే అది ఎంత పడితే అంత కాకుండా పద్దతిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అండు కొర్ర, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. చిరుధాన్యాలను తినడం వల్ల పలు వ్యాధులను దరిచేరనీయవు. ఇంతకీ ఏయే చిరుధాన్యాలు ఏయే వ్యాధులను తగ్గిస్తాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.
కొర్ర
నరాల బలహీనత, మానసిక వ్యాధులు,ఆర్థరైటిస్, పార్కిన్సన్, మూర్చ వ్యాధులను దూరం చేస్తుంది.
అరికెలు
రక్తహీనత, షుగర్, మలబద్దకం, రక్తశుద్ధి, నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తుంది.
ఊదలు
లివర్ సమస్యలు, కిడ్నీ బలహీనత, అధిక కొలెస్ట్రాల్, కామెర్ల వంటి అనారోగ్య సమస్యలను తగ్గి్స్తుంది.
Also Read:Heavy Rain Forecast: దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
సామలు
పీసీఓడీ, సంతానలేమి, అండాశయ సమస్యలు, పురుషుల్లో వీర్యకణ గుణన సమస్యలను తగ్గి్స్తుంది.
అండుకొర్ర
జీర్ణ సమస్యలు, రక్తపోటు, థైరాయిడ్, కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
Also Read:CM Revanth Reddy: హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
జొన్నలు
గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఊబకాయం, షుగర్ ను నియంత్రిస్తాయి.
సజ్జలు
ఆస్తమా, యాస్మా, ఇమ్యూనిటీ సమస్యలు, రక్తహీనతను దూరం చేస్తాయి.
Also Read:BrahMos: చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ ముందు సరిపోవు: యూఎస్ నిపుణుడు.
రాగులు
ఎముకల బలం, కాల్షియం లోపం, డయాబెటిస్, బరువు పెరగడానికి ఉపయోగకరంగా ఉంటాయి.